Saturday, February 11, 2012

అమాయకుడు అజ్మల్ కసబ్



ముంబై నగరం అంటే ఇస్లామిక్ తీవ్రవాదులకు ఎంతో అభిమానం. అందుకే క్రమం తప్పకుండా శక్తివంచన లేకుండా  శ్రద్ధగా ముంబై నగరం మీద దాడులు చేస్తుంటారు. 2008 సంవత్సరంలో కూడా మూడు రోజులు యుద్ధం చేశారు. జనాబ్ మహమ్మద్ అజ్మల్ కసబ్ సాహెబ్ గారు తనవంతు యోగదానంగా హత్యలూ అవీ చేశారు. వారికి మరణశిక్ష విధించబడింది. ప్రస్తుతం సాయిబుగారు ముంబై జైలులో క్రొత్త పెళ్ళికొడుకులాగా హాయిగా కాలం గడుపుతున్నారు. (తీవ్రవాదులను అల్లుళ్ళుగా చూడటం మన సాంప్రదాయం కదా!) ఇది ఇలా ఉండగా ఒక హిందూ వీర సెక్యులరిస్టు సుప్రీంకోర్టులో ఇలా విన్నవించుకున్నాడు. "కసబ్ ముంబై దాడులకు కుట్ర చేయలేదు. యుద్ధానికి కుట్ర పన్నినట్లుగా చెప్పడానికి వీలులేదు, సాక్ష్యాధారాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. కసబ్ కు సరియైన న్యాయం లభించడం లేదు" అని బల్లగ్రుద్ది వాదిస్తున్నాడు. ఇతని పేరు రామచంద్రన్. వృత్తి కసబ్ న్యాయవాది. జస్టిస్ అప్తాబ్ ఆలం ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ వాదనలు జనవరి 31 నాడు సుప్రీంకోర్టులో జరిగాయి.

ఇటువంటి వింతలు హిందూ దేశంలో మాత్రమే జరుగుతాయి.
 
  సాక్షి 1/2/2012 వార్తా ఆధారంగా..

No comments:

Post a Comment